ఎంపీ కవితను కలిసిన బాక్సర్ నిఖత్ జరీన్

ఎంపీ కవితను కలిసిన బాక్సర్ నిఖత్ జరీన్

బాక్సర్ నిఖత్ జరీన్ టీఆర్ఎస్ ఎంపీ కవితను హైదరాబాద్‌లోని కవిత నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల బేలెగ్రేడ్‌లో జరిగిన 56వ అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించిన జరీన్‌ను కవిత అభినందించారు. జరీన్‌తో పాటు అసాముద్దీన్ అంతర్జాతీయంగా తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చారంటూ ప్రశంసించారు ఎంపీ కవిత. వీరు ఇద్దరూ నిజామాబాద్‌కు చెందిన వారు కావడం ఆ జిల్లా వాసులకు సంతోషకరమైన విషయమన్న కవిత... రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, క్రీడాకారులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు.