మహేష్ బాబుతో బోయపాటి సినిమా..?

మహేష్ బాబుతో బోయపాటి సినిమా..?

భరత్ అనే నేను హిట్ తరువాత మహేష్ బాబు తన 25 వ సినిమా మహర్షి సినిమాలో బిజీగా ఉన్నారు.  వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 5 న రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా తరువాత సుకుమార్ తో సినిమా ఉండబోతుంది.  ఇప్పటికే ఈ సినిమాను ఇద్దరు కన్ఫర్మ్ చేశారు.  

ఇదిలా ఉంటె, రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసిన బోయపాటి, మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించాడు.  వినయ విధేయ రామ ప్రమోషన్స్ సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయపాటి ఈ విషయాన్ని చెప్పాడు.  మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ గా ఉన్న బోయపాటి మహేష్ బాబుతో కూడా ఆ తరహా స్టోరీతోనే సినిమా చేస్తాడా చూడాలి.  మెగాస్టార్ తో కూడా సినిమా ఉంటుందని బోయపాటి చెప్పాడు బోయపాటి.