రూ.39కే అదిరిపోయే ఆఫర్...

రూ.39కే అదిరిపోయే ఆఫర్...

టెలికం మార్కెట్‌లో రిలయన్స్ జియో ఎంట్రీ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది... దీంతో జియోకు పోటీగా ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లకు పలు ఆకర్షణీయమైన పథకాలు తీసుకొస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే పలు ఆకర్షణీయమైన ప్లాన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్... తాజాగా తన ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.39కే ఓ నూతన ప్లాన్‌ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ కింద అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది. ఈ ప్లాన్ కాలపరిమితి 10 రోజులుగా నిర్ణయించారు. ఢిల్లీ, ముంబై మినహా బీఎస్‌ఎన్‌ఎల్ అన్ని సర్కిళ్లలో ఈ ప్లాన్ అందుబాటులో ఉండగా... ఈ ప్లాన్‌లో ఎలాంటి మొబైల్ డేటా ఆఫర్ చేయడం లేదు.