సికింద్రాబాద్‌లో బస్సు బీభత్సం

సికింద్రాబాద్‌లో బస్సు బీభత్సం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్ బ్రేక్‌లు ఫెయిలవడంతో అదుపుతప్పి జనాల మీదకు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత బస్సు 500 మీటర్ల దూరం దూసుకెళ్లి మెట్రో పిల్లర్‌ను ఢీకొని ఆగింది. ప్యాట్నీ కూడలి నుంచి సికింద్రాబాద్‌ వైపు బస్సు వెళ్తుండగా క్లాక్ టవర్ వద్ద ఈ ఘటన జరిగింది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు.