ప్రస్తుత పార్టీలతో రాష్ట్రానికి ఉపయోగం లేదు: రాఘవులు

ప్రస్తుత పార్టీలతో రాష్ట్రానికి ఉపయోగం లేదు: రాఘవులు

ప్రస్తుత పార్టీలతో ఏపీ రాష్ట్రానికి ఉపయోగం లేదు అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. ఇవాళ అయన గుంటూరులో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు రాష్ట్రానికి అవసరమని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను నిరాకరిస్తూ బీజేపీ నవ్యఆంధ్రను పురిట్లోనే అనారోగ్యం పాలుచేసిందని ఎద్దేవా చేశారు. నాలుగు సంవత్సరాలు కేంద్రంతో అంటకాగిన టిడీపీ.. ఈ పాపంలో పాలుపంచుకుందని విమర్శించారు. కేంద్రంతో వైసీపీ కఠినంగా వ్యవహరించడం లేదని బీవీ రాఘవులు అన్నారు. ఇక ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనమైందని పేర్కొన్నారు.

వామపక్షాలు తొలి నుండి ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రస్తుత పార్టీలతో రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం, ప్రయోజనం లేదని బీవీ రాఘవులు విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యామ్నాయ పార్టీలతో కలసిరావాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ విజయవంతం అవుతున్నారు.. మాభావాలకు దగ్గరగా ఉండి అప్పటి పరిస్తుతులను బట్టి జనసేనతో పొత్తును ఆలోచిస్తామని బీవీ రాఘవులు తెలిపారు.