కేసీఆర్‌కు అందిన నివేదిక

కేసీఆర్‌కు అందిన నివేదిక

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మంత్రుల కేటీఆర్, జగదీష్ రెడ్డితో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన కమిటీ ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 4న, ఉపాధ్యాయుల సమస్యలపై 5న సంబంధిత సంఘాల నేతలతో సమావేశమైన ఈ కమిటీ ఈ సందర్భంగా నేతలు కమిటీ దృష్టికి తీసుకొచ్చిన డిమాండ్లను సీఎం కేసీఆర్‌ను కలిసి అందజేశారు మంత్రులు ఈటల, జగదీష్‌రెడ్డి. ప్రభుత్వం ముందు ఉద్యోగ సంఘాలు 18 డిమాండ్లను ఉంచడంతో ఈ నివేదికపై అధికారులతో సమీక్షించనున్నారు ముఖ్యమంత్రి... ఈ నెల 14వ తేదీన ఉద్యోగ సంఘాలు, టీచర్ల సంఘాల నేతలతో సమావేశంపై వారి డిమాండ్లపై చర్చించనున్నారు కేసీఆర్.