ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలం...

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలం...

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు మంత్రి ఈటల రాజేందర్... ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, కేటీఆర్, జగదీష్ రెడ్డితో కమిటీ వేశారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు... ఇప్పటికే ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 4వ తేదీన టీజీవో, టీఎన్జీవోలు, 5వ తేదీన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించిన కమిటీ నివేదిక తయారు చేసినట్టు తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. ప్రమోషన్లు, బదిలీలు, పీఆర్సీతో పాటు 34 డిమాండ్లు... టీచర్లు, ఉద్యోగుల 18 డిమాండ్లు కమిటీ దృష్టికి తీసుకొచ్చారన్న ఈటెల... ఈ రోజు సాయంత్రం సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు. 

తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమన్న ఈటెల రాజేందర్... పనికిరాని ఉద్యోగులని గతంలో నెపం వేసినా... అద ఉద్యోగులతో అనేక పథకాలు విజయవంతం చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఇంజనీర్లు తెలంగాణ ఇంజనీర్లే నంటూ ప్రశంసించిన ఆర్థిక మంత్రి... ఉద్యోగుల సహకారం లేనిదే అభివృద్ధి సాధ్యం కాదన్నారు. అందుకే వారి సమస్యల పరిషారంపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.