మంత్రులతో ముగిసిన ఆర్టీసీ కార్మిక సంఘం భేటీ

మంత్రులతో ముగిసిన ఆర్టీసీ కార్మిక సంఘం భేటీ

34 డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మిక సంఘం ఇచ్చిన సమ్మె నోటీసును వెనక్కు తీసుకునేందుకు గానూ.. ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం సచివాలయంలో సమావేశమై చర్చలు జరిపింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం భేటీ వివరాలను తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి మీడియాకు వివరించారు. పీఆర్సీ, ఉద్యోగ భద్రత సహా 19 అంశాలపై చర్చలు జరిపామని.. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారని నేతలు తెలిపారు. రిమూవల్‌పై చర్చ జరిగిందని.. దాన్ని తొలగించాలని మంత్రులు కూడా ఆలోచిస్తున్నారని.. ప్రైవేట్ రవాణాను అరికట్టాలని.. 50శాతం ఫిట్‌మెంట్ కావాలని కోరినట్లు తెలిపారు. ఈ నెల 16న ఐఆర్‌పై జరిగే చర్చకు మమ్మల్ని కూడా ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్లు అశ్వద్ధామరెడ్డి అన్నారు.