చెరువులోకి దూసుకెళ్లిన కారు..

చెరువులోకి దూసుకెళ్లిన కారు..

సినిమాల్లో అలా గాల్లో లేచి బ్రిడ్జిల పై నుంచి కార్లు కిందికి పడిపోతుంటాయి... చెరువుల్లోకి దూసుకెళ్తుంటాయి... ఇలాంటి ఘటనే నిర్మల్ జిల్లాలో జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల కంచెరోని చెరువులోకి దూసుకెళ్లింది ఓ స్విఫ్ట్ కారు... చెరువులో పేరుకుపోయిన చెత్త, చెదారం, గడ్డి మధ్యలో చిక్కుకుపోయింది... అయితే, ప్రమాద సమయంలో కారులో ప్రయాణం చేస్తున్న ఇద్దరు ప్రయాణికులు మాత్రం సురక్షితం బయటపడ్డారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చెరువు నుంచి ఆ కారును వెలికి తీశారు.