హార్థిక్, రాహుల్‌, కరణ్‌లపై కేసు నమోదు

హార్థిక్, రాహుల్‌, కరణ్‌లపై కేసు నమోదు

టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లపై కేసు నమోదైంది. వీరితో పాటు 'కాఫీ విత్ కరణ్' షో హోస్ట్ కరణ్ జోహార్‌పై కూడా కేసు నమోదైంది. ప్రముఖ టీవీ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో  పాండ్యా, రాహుల్‌లు మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు జోధ్‌పూర్‌లోని లూని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఐపీసీలోని వివిధ సెక్షన్ల ప్రకారం వీరి ముగ్గురిపై కేసు నమోదు చేసారు. అయితే ఎవరు కేసు నమోదు చేసారో తెలియాల్సి ఉంది.

మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను పాండ్యా, రాహుల్‌లను బీసీసీఐ సస్పెండ్ చేసింది. నిషేధం ఎత్తివేయాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు కోరగా.. వీరి కెరీర్‌ని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ తాత్కాలికంగా నిషేధాన్ని ఎత్తి వేసింది. దీంతో ప్రస్తుతం పాండ్యా న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా.. రాహుల్ ఇండియా ఎ టీమ్‌లో ఆడుతున్నాడు. తాజాగా రాజస్థాన్ లో కేసు నమోదవడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.