రూ.20 లక్షల కోట్లు దాటిన నగదు ప్రవాహం

రూ.20 లక్షల కోట్లు దాటిన నగదు ప్రవాహం

పెద్దనోట్లు రద్దయిన రెండేళ్ల తర్వాత దేశంలో చలామణిలో ఉన్న నగదు ప్రవాహం మొదటిసారి రూ.20 లక్షల కోట్లను దాటింది. ఈ రెండేళ్ళలోపే నవంబర్ 16, 2018 నాటికి దేశంలో నగదు ప్రవాహం రూ.20.15 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలియజేసింది. నవంబర్ 8, 2106న పెద్దనోట్ల రద్దుకు ముందు చలామణిలో ఉన్న నగదు కంటే ప్రస్తుతం 12.1% ఎక్కువ మొత్తం ఉన్నట్టు ఆర్బీఐ తెలిపింది. అధిక విలువ కరెన్సీ రద్దుకు రూ.17.97 లక్షల కోట్లు సర్కులేషన్ లో ఉన్నాయి. ఇది డిసెంబర్ 23, 2016 నాటి కంటే 1.14 రెట్లు పెరిగిందని తెలిపింది. 

నవంబర్ 8, 2016న అప్పుడు చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లు చెల్లుబాటు కావని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హఠాత్తుగా ప్రకటించారు. వాటి స్థానంలో కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టారు. పాత నోట్లను బ్యాంకులకు అప్పజెప్పడం జరిగింది. ప్రస్తుతం కొత్త రూ.50, రూ.200 నోట్లను చెలామణిలో ప్రవేశపెట్టారు. గత ఏడాదిగా ఆర్బీఐ రూ.3.56 లక్షల కోట్ల కరెన్సీని ప్రవేశపెట్టింది. పెద్ద నోట్లను (రూ.500, రూ.1,000) మార్కెట్ నుంచి ఉపసంహరించడంతో డిసెంబర్ 23, 2016న నగదు ప్రవాహం రూ.9.4 లక్షల కోట్లకు పడిపోయిందని చెప్పింది.