ప్రొఫెసర్ అవుతాడనుకుంటే... సివిల్స్ కొట్టాడు...

పీహెచ్‌డీ పూర్తిచేసి నా కుమారుడు ప్రొఫెసర్ అవుతాడని మేం అనుకుంటే... సివిల్స్ సాధించాడని చెప్పారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తల్లి వసుంధర... మాతృదినోత్సవం సందర్భంగా  ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో... లక్ష్మీనారాయణ, ఆయన తల్లి వసుంధర మాట్లాడారు... సివిల్స్‌కు ఎలా ప్రిపేర్ చేశారనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ... పీహెచ్‌డీ చేసి ప్రొఫెసర్ అవుతాడని అనుకున్నాం... కానీ, సివిల్స్ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చే వరకు లక్ష్మీనారాయణ సివిల్స్ రాసిన విషయమే తమకు తెలియదన్నారామె. 

సివిల్స్ ఫలితాలను న్యూస్ పేపర్‌లో చూసిన వాళ్ల నాన్న ఆ విషయం చెప్పడంతో తెలిసిందని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ఆమె... ఈ విషయం తెలిసి మేమంతా ఆశ్చర్యపోయామన్నారు. చిన్నపట్టి నుంచి ఏ విషయానైనా అర్థం చేసి ఒప్పించేవాడన్న వసుంధర... తన కుమారుడు లక్ష్మీనారాయణ గురించి ఏం చెప్పారు... లక్ష్మీ నారాయణ అలనాటి సంగతుల గురించి ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి...