డీఎల్ఎఫ్ పై సీబీఐ ఎఫ్ఐఆర్

డీఎల్ఎఫ్ పై సీబీఐ ఎఫ్ఐఆర్

ప్రముఖ నిర్మాణ సంస్థ డీఎల్ఎఫ్ పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. భూ సేకరణ కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో డీఎల్ఎఫ్, అన్సాల్ ప్రాపర్టీస్ ని నిందితులుగా చేర్చింది. అలాగే ఎమార్ ఎంజిఎఫ్, ఆర్ఎస్ ఇన్ఫ్రా, జెఎండి లిమిటెడ్, హెచ్ఎస్ రియాల్టీ, సనా రియల్టర్స్ కంపెనీలని కూడా సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. దీంతో స్టాక్ మార్కెట్లో ఆయా కంపెనీల షేర్లు భారీగా నష్టపోతున్నాయి.