నీరవ్‌ మోడీపై రెడ్‌ కార్నర్‌ నోటీస్‌?

నీరవ్‌ మోడీపై రెడ్‌ కార్నర్‌ నోటీస్‌?

బ్యాంకులకు వేల కోట్లు  టోపీ పెట్టిన వజ్రాలు, నగల వ్యాపారి నీరవ్‌ మోడీపై రెడ్‌ కార్నర్‌ నోటీసును జారీ చేయాల్సిందిగా ఇంటర్‌ పోల్‌ను కోరింది సీబీఐ. నీరవ్‌ మోడీ పాటు ఆయన బంధువు మెహుల్‌ చోక్సీ పైనా ఇదే నోటీసు జారీ చేయాలని కోరింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు వీరు రూ. 13,578 కోట్ల మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి.  ఇంటర్‌ పోల్‌ గనుక రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ చేస్తే... 190 దేశాల పోలీసులు వీరి అరెస్ట్‌ చేసి భారత్‌కు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. సీబీఐ చేసిన విజ్ఞప్తితో ఇంటర్‌ పోల్‌ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరోవైపు నీరవ్‌ మోడీ తమ దేశంలో ఉన్న మాట నిజమేనని భారత అధికారులకు బ్రిటన్‌ అధికారులు  తెలిపినట్లు సమాచారం.