ఈసీ సంతృప్తి చెందాకే తెలంగాణలో ఎన్నికలు..

ఈసీ సంతృప్తి చెందాకే తెలంగాణలో ఎన్నికలు..

తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తోందని.. ఏర్పాట్లపై ఈసీ సంతృప్తి చెందాకే నిర్ణయం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ రద్దు అనంతరం.. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. అన్ని పార్టీల సమక్షంలో ఈవీఎంలు పరిశీలిస్తామని.. కలెక్టర్లు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. ఓటర్లను చైతన్యపరిచేందుకు గ్రామాల్లో కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.