అన్ని విషయాలు మాట్లాడేసినం : సునీల్ అరోరా

అన్ని విషయాలు మాట్లాడేసినం : సునీల్ అరోరా

28 ఫిబ్రవరి లోపుగా బదిలీలు చేపట్టాలని ఏపీ సీఎస్, డీజీపీకి తెలియజేసామని కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. ఏపీలో రెండ్రోజులుగా పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా బృందం తమ పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించింది. అన్ని రాజకీయ పార్టీల నేతలు, సీఎస్, డీజీపీ, హోం సెక్రటర్లతో రెండు రోజుల పాటు సమావేశమయ్యామని సీఈసీ సునీల్ అరోరా చెప్పారు. రాజకీయ పార్టీలన్నీ యువతను ఓటర్లుగా చేర్చాలని కోరినట్లు తెలిపారు. ఫార్మ్ 6 పెండింగ్ ఉంటోందని, డేటా ఆపరేటర్లకు పాస్ వర్డ్స్ ఇస్తున్నారని రాజకీయ పార్టీలు తమ దృష్టికి తెచ్చినట్లు సునీల్ అరోరా చెప్పుకొచ్చారు.  

మద్యం, నగదుపై దేశ వ్యాప్తంగా నిఘా ఉంటుందని సీఈసీ సునీల్ అరోరా చెప్పారు. అధికారుల నిర్లిప్తత కనుక ఉంటే ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుందని వివరించారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న గిరిజనులు ఇతరులకు అదనపు భద్రత కల్పిస్తామే తప్ప, ప్రత్యేక బూతుల ఏర్పాటు చేయలేమని అన్నారు. అయితే సమస్యాత్మక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని  సీఈసీ, చెప్పుకొచ్చారు.


వీవీ ప్యాట్ల లెక్కింపుపై వినతులు వచ్చాయని,ఏపీలో కూడా వీవీ ప్యాట్ల లెక్కింపు జరుగుతుందని సునీల్ అరోరా స్పష్టం చేసారు. కర్ణాటక, బెంగుళూరు ఎన్నికల్లో 26 వరకు స్వల్పంగా ఫిర్యాదులు వచ్చాయని, ఏపీలో సైతం ఎన్నికలపై ఎటువంటి ఫిర్యాదులైనా చేయవచ్చని తేల్చి చెప్పారు.ఈవీఎంలలో ఎంత శాతం వీవీ ప్యాట్ల లెక్కింపు జరపాలనే దానిపై ఆగస్టు 2018లో ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేసారు. అ బృందం నివేదిక రావాల్సి ఉందన్నారు.ఈవీఎంలలో అనుమానాలు వస్తున్నాయే తప్ప.. లోక్ సభ ఎన్నికల తర్వాత ఢిల్లీ, కర్ణాటక, మిజోరాం, త్రిపుర ఇలా ఫలితాలు అన్నీ వేర్వేరుగా వచ్చాయనేది గుర్తించాల్సిన విషయం సునీల్ అరోరా సమర్ధించుకున్నారు.