అమిత్‌షాపై దాడి ఘటనపై హోంశాఖ సీరియస్...

అమిత్‌షాపై దాడి ఘటనపై హోంశాఖ సీరియస్...

బీజేపీ అధినేత అమిత్‌ షా కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటనను కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకుంది. జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖను కోరింది. మరోవైపు ఏపీ బీజేపీ నేతలు దాడికి సంబంధించి పార్టీ పరంగా అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. అధికారయంత్రాంగానికి ముందస్తు సమాచారం ఉన్నా... లైట్ తీసుకున్నారని చెప్పినట్టు సమాచారం. బీజేపీ చీఫ్‌కు తిరుమలలో చేదుఅనుభవం ఎదురైన సంగతి తెలిసిందే... శ్రీవారిని దర్శించుకుని వెళ్తున్న ఆయన కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడి ఘటనతో అప్రమత్తమైన పోలీసులు సేఫ్‌గా ఆయన కాన్వాయ్‌ని ఎయిర్‌పోర్టుకు పంపించారు. ఇప్పటికే నిప్పు, ఒప్పులా మారిపోయిన ఏపీ బీజేపీ, టీడీపీ నేతల మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరలేపింది ఈ ఘటన.