బాలయ్య చేయగలడా లేదా అని భయపడ్డా !

బాలయ్య చేయగలడా లేదా అని భయపడ్డా !

నందమూరి బాలక్రిష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రం మొన్న విడుదలై విజయవంతంగా నడుస్తోంది.  ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సినిమా చూసి అభినందించగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం బాలయ్య, దర్శకుడు క్రిష్ తో కలిసి విజయవాడలో సినిమా చూసి చాలా బాగుందంటూ అభినందించారు.  మొదట బాలయ్య ఎన్టీఆర్ పాత్రను చేయగలడో లేదో అని భయపడ్డానన్న బాబు సినిమా చూశాక ఆ పాత్రను బాలయ్య తప్ప  ఇంకొకరు చేయలేరనిపించింది, ఎన్టీఆర్ మళ్ళీ వచ్చి చేశారా అనేలా చేశాడు, నా పాత్రను కూడా బాగా తీశారు.  క్రిష్ ఒక గొప్ప సినిమాను డైరెక్ట్ చేశాడు అన్నారు.