ఫిబ్రవరి 1న ఫించన్ దారులకు రూ.3వేలు

ఫిబ్రవరి 1న ఫించన్ దారులకు రూ.3వేలు

ఏపీ సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుకగా ఫించన్ మొత్తాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న వెయ్యి రూపాయల ఫించన్ ను రూ.2 వేలకు పెంచారు. నెల్లూరు జిల్లా బోగోలులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. పాత, కొత్త పింఛన్లు కలిపి ఫిబ్రవరి నెలలో రూ.3వేలు అందిస్తామన్నారు. మార్చి నుంచి అంతా రూ.2వేలు పింఛను తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని మంత్రి లోకేష్ ట్విటర్ లో తెలిపారు. రాష్ట్రంలోని 54 లక్షల మంది ఎన్టీఆర్ భరోసా పింఛనుదారులకు సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేసింది. వారికిప్పుడిస్తున్న పింఛన్లను రెండింతలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుగారు చారిత్రక నిర్ణయం తీసుకొని లబ్దిదారుల మోముల్లో సంతోషాలను రెట్టింపు చేశారు. దేశంలో మరెక్కడా ఇంతటి సంక్షేమం లేదు అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.