జన్మభూమిలో రికార్డు సంఖ్యలో ఆర్జీలు 

జన్మభూమిలో రికార్డు సంఖ్యలో ఆర్జీలు 

ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికే ప్రణాళిక లేకుండా పోయిందని.. నీతి ఆయోగ్ వచ్చాక ప్రణాళిక సంఘమే లేదని.. అందుకే ప్రణాళికే లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన మాట్లాడుతూ ఏపీలో ఏపీలో మాత్రం గ్రామ స్థాయిలో కూడా ఐదేళ్ల ప్రణాళికలను చేశామన్నారు. ఈ నెల 12 నుంచి 21 వరకు జిల్లా స్థాయి ప్రణాళికలను సిద్ధమ చేస్తామన్నారు. త్వరలోనే వచ్చే ఐదేళ్ల కాలానికి రాష్ట్ర స్థాయిలో విజన్ డాక్యుమెంట్ రెడీ చేస్తామన్నారు. జన్మభూమి సభల్లో విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పనకు కసరత్తు చేశామని. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 2024 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నామని బాబు చెప్పారు. ఇప్పటి వరకు పడిన కష్టానికి ఈ జన్మభూమిలో ఫలితం కన్పించిందన్న బాబు.. కొందరు కావాలని గొడవలు పెట్టుకునే ప్రయత్నం చేసినా ఫలించ లేదన్నారు. ఈ జన్మభూమిలో 1.28 లక్షల మంది ఉద్యోగులు పాల్గొన్నారని.. ప్రజలు లక్షల సంఖ్యలో స్వచ్ఛంధంగా విచ్చేశారని చెప్పారు. 5,68,616 అర్జీలు వస్తే.. 33,888 అర్జీలను పరిష్కరించామని.. 3,69,708 అర్జీలను పరిశీలించి.. పెండింగ్‌లో పెట్టామని బాబు చెప్పారు.