'జగన్‌ అప్పుడైనా అమరావతి వస్తారేమో?'

'జగన్‌ అప్పుడైనా అమరావతి వస్తారేమో?'

సీబీఐ కోర్టు వస్తేనైనా అమరావతికి వైసీపీ అధినేత జగన్ వస్తారేమోనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఇవాళ ఆయన అమరావతిలో మాట్లాడుతూ జగన్ పాదయాత్ర చేసి హైదరాబాద్ వెళ్లారే తప్ప.. అమరావతికి రాలేదని అన్నారు. ఏపీ గురించి లేనిపోని ప్రేమ ఒలకపోసేవారు అమరావతికి చుట్టపు చూపుగా వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జగన్ ఇక అమరావతికి వస్తారని బాబు అన్నారు. తన కుటుంబ సభ్యులు తనను హైదరాబాద్‌కు రమ్మన్నా వెళ్లడం లేదని.. అమరావతిలోనే ఉంటానని చెప్పానని తెలిపారు.  రాజధానిని మార్చేస్తామంటూ కొందరు ఏదేదో చెబుతున్నారన్న బాబు.. ప్రజలు బాగుపడితే వైసీపీకి నచ్చదని అన్నారు.