లెక్కలు చెప్పేందుకు రెడీ: బాబు

లెక్కలు చెప్పేందుకు రెడీ: బాబు

ఏపీకి డబ్బులిచ్చామంటూ ప్రధాని అబద్ధాలు చెబుతున్నారని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ తాను లెక్కలు చెప్పలేదని ప్రధాని అంటున్నారని.. డీపీఆర్‌లు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సీఏజీ చేత అకౌంట్‌ ఆడిట్‌ చేయించుకోవచ్చునని.. తనది భయపడే తత్వం కాదని స్పష్టం చేశారు. మోడీకి జగన్‌ భయపడతారుగానీ.. తాను భయపడే ప్రసక్తే లేదన్నారు. మోడీ ఏపీ వచ్చి తనను తిట్టి వెళ్లిపోయారని.. కానీ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉందని బాబు అన్నారు. విభజన చట్టంలోని అంశాల అమలు కోసం పోరాటం చేస్తున్నామన్న బాబు.. తల్లికి దగా చేసిన వ్యక్తి మోడీ అని అన్నారు. తిట్టడం సులభం.. కానీ పనులు చేయడం కష్టం అని చెప్పారు.