అలా అనడం రాష్ట్ర ద్రోహం: బాబు

అలా అనడం రాష్ట్ర ద్రోహం: బాబు

రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశం మొత్తం గుర్తించిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఇవాళ ఢిల్లీలో పార్టీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన మోసాన్ని అంతా గుర్తించారని అన్నారు. బీజేపీని ఎండగట్టడంలో నిన్న సఫలమయ్యామని చెప్పారు. ఇవాళ రాష్ట్రపతిని కలుస్తున్నామన్న ఆయన.. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఇక్కడ నుంచి ప్రజల్లోకి వెళ్లి ఎలా పోరాడాలో అలా పోరాడదామని అన్నారు. ఢిల్లీ దీక్ష ఫ్లాప్ అని అనడం రాష్ట్ర ద్రోహం అన్న చంద్రబాబు..17పార్టీల ప్రతినిధులు పాల్గొనడం ఫ్లాప్  షో నా..?దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టడం ఫ్లాప్  షో నా..?' అని ప్రశ్నించారు. ఏపీకి హోదా ఇవ్వాలని అన్ని రాష్ట్రాల నేతలూ అన్నారని.. మన ధర్మపోరాటానికి అదే నైతిక విజయం అని బాబు అభిప్రాయపడ్డారు. బీజేపీ, వైసీపీ మినహా అన్ని పార్టీల మద్దతూ ఏపీకి ఉందని అన్నారు.