'హోదా' కోసం బలిదానాలు వద్దు: బాబు

'హోదా' కోసం బలిదానాలు వద్దు: బాబు

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రాబాబునాయుడు సూచించారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ హోదా కోసం శ్రీకాకుళం జిల్లా వాసి అర్జునరావు ఆత్మహత్య బాధాకరమని అన్నారు. అర్జునరావు కుటుంబానికి రూ.20లక్షలు ప్రకటించామని చెప్పారు. ఆ కుటుంబానికి అందరూ అండగా ఉండాలని కోరారు. ఢిల్లీలో రాబోయేది ఏపీకి హోదా ఇచ్చే ప్రభుత్వమేనన్న బాబు.. హోదాతో సహా చట్టంలో అన్ని అంశాలనూ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన హామీలు అమలయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు.