'కేంద్రంపై పోరాడుతున్నాం.. మీరూ రండి..'

'కేంద్రంపై పోరాడుతున్నాం.. మీరూ రండి..'

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ నిర్వహిస్తున్న ధర్మపోరాట దీక్షకు హాజరుకావాలని పలువురు జాతీయ నాయకులకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు లేఖలు రాశారు. మాజీ ప్రధాన మంత్రులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు సీఎంలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ లోకసభా పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, డీఎంకే నేత కనిమొళిలకు లేఖలు పంపించారు. సమాజ్ వాదీ నేత ములాయం సింగ్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, బీఎస్పీ నేత మాయావతిలను కూడా దీక్షకు హాజరుకావాలని కోరారు.