'మోడీ వస్తున్నారు.. ఎక్కడ దాక్కున్నావ్‌ జగన్‌'

'మోడీ వస్తున్నారు.. ఎక్కడ దాక్కున్నావ్‌ జగన్‌'

ప్రధాని మోడీ రాకను వ్యతిరేకిస్తూ ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పార్టీ నేతలతో ఇవాళ ఉదయం టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ మోడీ ఏ రాష్ట్రం వెళ్లినా నిరసనలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఏపీకి అన్యాయం చేసిన మోడీ.. ఇక్కడి ప్రజలను ఎగతాళి చేసేందుకే వస్తున్నారని బాబు విమర్శించారు. వ్యవస్థలను నాశనం చేస్తూ వాటి గురించే మాట్లాడడం మోడీకే చెల్లిందని బాబు అన్నారు.

మోడీ రాకను వైసీపీ మినహా అందరూ వ్యతిరేకిస్తున్నారని.. వైసీపీ భరోసాతోనే మోడీ బహిరంగ సభ జరుగుతోందని.. కన్నా లక్ష్మీనారాయణ.. జగన్‌ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని బాబు ఆరోపించారు. మోడీకి జగన్ సహకరిస్తున్నారనే విషయాన్ని ఆందోళనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. 'ఎక్కడ దాక్కున్నావ్ జగన్' అనే నినాదంతో ఆందోళన చేయాలన్నారు. ఏపీకి మోడీ-జగన్‌ల దిష్టి పోవాలన్న బాబు.. మోడీ, జగన్ అక్కర్లేదంటూ ప్రతిఒక్కరూ ఇవాళ రెండు కుండలు పగలగొట్టి నిరసనలు తెలియజేయాలని సూచించారు.