ఇవాళ 'ఎన్టీఆర్‌'ను చూడనున్న చంద్రబాబు

ఇవాళ 'ఎన్టీఆర్‌'ను చూడనున్న చంద్రబాబు

దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సినీనటుడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన 'కథానాయకుడు' సినిమాను ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూడనున్నారు. ఇవాళ రాత్రి ఏడు గంటలకు విజయవాడలో చంద్రబాబు ఈ సినిమా చూస్తారు. చంద్రబాబుతోపాటు ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌, మరికొంతమంది సాంకేతిక నిపుణులు ఈ సినిమాను వీక్షిస్తారు.