సెంచరీతో చెలరేగిన రాయుడు, చెన్నై విన్

సెంచరీతో చెలరేగిన రాయుడు, చెన్నై విన్

ఐపీఎల్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైట్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న హైదరాబాద్‌పై చెన్నై విక్టరీ కొట్టింది... రాయుడు సెంచరీకి తోడు వాట్సన్ చెలరేగడంతో 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది చెన్నై. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి... చెన్నై ముందు 180 పరుగుల టార్గెట్‌ పెట్టింది. ధావన్ 79, విలియమ్సన్ 51 పరుగులు చేసి హైదరాబాద్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు. అయితే చెన్నై బ్యాట్స్‌మన్స్ చెలరేగడంతో 19వ ఓవర్‌లోనే విజయం ఆ జట్టును వరించింది. 

సూపర్ ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు ఈ మ్యాచ్‌లో మరోసారి విశ్వరూపం చూపాడు... 62 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగిన రాయుడు 100 పరుగులు చేసి నాటౌట్‌గా  నిలిచాడు. ఐపీఎల్ కెరీర్‌లో ఇదే రాయుడికి తొలి సెంచరీ కావడం విశేషం. ఇక రాయుడుతో పాటు మరో ఓపెనర్ షేన్ వాట్సన్ కూడా చెలరేగి ఆడాడు 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి చెన్నై విక్టరీలో కీలక పాత్ర పోషించారు. ధోనీ 14 బంతుల్లో 20 పరుగలు చేయగా... రైనా 2 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. మొత్తానికి మరో ఓవర్ మిగిలుండగానే రెండు వికెట్లు కోల్పోయి విక్టరీ కొట్టింది చెన్నై... దీంతో చెన్నై ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోగా... ఈ సీజన్‌లొ చెన్నై చేతిలో హైదరాబాద్‌ ఓడిపోవడం రెండోసారి. కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఇప్పటికే ప్లేఆఫ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.