వారి కోసం రాత్రి 7గంటల వరకు పోలింగ్ 

వారి కోసం రాత్రి 7గంటల వరకు పోలింగ్ 

తెలంగాణ ఎన్నికల కోసం ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికి టోకెన్స్ ఇస్తామనీ ఎన్నికల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రజిత్ కుమార్ వెల్లడించారు. సాయంత్రం 5గంటల లోపు టోకెన్ తీసుకున్న వారికోసం రాత్రి 7గంటలకు పోలింగ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వారు 7గంటల వరకు వారి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించామని  పేర్కొన్నారు. డబ్బులు, మద్యం పెద్ద ఎత్తున పంపిణీ అయ్యే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. దాన్ని అరికట్టేందుకు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశామని తెలిపారు.  కేంద్రాన్ని కోరిన అన్ని బలగాలు వచ్చాయని తెలిపారు. ఎపిక్ కార్డు లేకపోతే ఓటర్ స్లీప్ తో పాటు 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకొని వస్తే సరిపోతుందని తెలిపారు. అన్ని జిల్లాల్లో ఎపిక్ కార్డులు, ఓటర్ స్లిప్స్ పంపిణీ చేశాం. 26 డిసెంబర్ నుంచి పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారు చేస్తామని తెలిపారు. ఓటు లేని వాళ్ళు అందరూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు అని సూచించారు. 13 నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. మిగితా చోట్లా సాయంత్రం 5వరకు పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈవీఎంలలో ఎలాంటి సమస్యలు రావు అని తెలిపారు. ప్రతి సెక్టార్ మేజిస్ట్రేట్ వద్ద 2 ఈవీఎంలు, వివిఫ్యాట్ లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈవీఎంలలో ఏమైనా సమస్యలు తలెత్తితే... 30 నిమిషాల్లో కొత్తవి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.  3,578 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ను ఈసీ నేరుగా మానిటరింగ్ చేస్తుందని వెల్లడించారు.