నందిగామ వెళ్లిన జూబ్లీహిల్స్ పోలీసులు

నందిగామ వెళ్లిన జూబ్లీహిల్స్ పోలీసులు

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుల కోసం ఏపీకి వెళ్లారు తెలంగాణ పోలీసులు. ఈ కేసులో నిందితులుగా ఉండి ప్రస్తుతం నందిగామ సబ్‌జైలులో ఉన్న రాకేష్‌రెడ్డి, శ్రీనివాసులను తీసుకెళ్లేందుకు నందిగామ వెళ్లారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు. నందిగామ కోర్టులో న్యాయమూర్తి అనుమతితో నిందితులను హైదరాబాద్‌కు తరలించేందుకు వెళ్లారు. కోర్టుకు సెలవు కావడం, నందిగామ జడ్జి సెలవులో ఉండటంతో జగ్గయ్యపేట కోర్టు ఇంచార్జ్‌ న్యాయమూర్తి అనుమతి కోసం జగ్గయ్యపేటకు వెళ్లారు జూబ్లీహిల్స్ పోలీసులు.