చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సింధు, శ్రీకాంత్‌

చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సింధు, శ్రీకాంత్‌

చైనా ఓపెన్‌లో భారత షట్లర్లు దూసుకెళ్తున్నారు. పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో సింధు 21-12, 21-15తో బుసానన్‌ (థాయిలాండ్‌)పై విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఆట ప్రారంభం నుండే దూకుడుగా ఆడుతూ సింధు రెండు గేమ్‌లను సునాయాసంగా గెలుచుకుంది.

పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 10-21, 21-9, 21-9తో టామీ సుగియార్టో (ఇండోనేషియా )పై విజయం సాధించి క్వార్టర్స్‌కి చేరుకున్నాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన శ్రీకాంత్‌ పుంజుకుని వరుసగా రెండు, మూడు గేమ్‌లను సొంతం చేసుకుని మ్యాచ్ ను కైవసం చేసుకున్నాడు.