పెళ్లి ఊరేగింపులో విషాదం.. ఒకరు మృతి

పెళ్లి ఊరేగింపులో విషాదం.. ఒకరు మృతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. తాగిన మైకంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మోతెమాలవాడలో పెళ్లి ఊరేగింపు జరుగుతుంది. బాలాజీ థియేటర్ సమీపంలోకి రాగానే పూటుగా మద్యం సేవించిన మత్తులో.. ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో ఇరువర్గాల వారు కత్తులతో ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అభిలాష్, కిరణ్ లపై కత్తులతో దాడి జరిగింది. అభి అనే యువకుడు మృతి  చెందగా.. మరో యువకుడు కిరణ్ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం కిరణ్ ను కరీంనగర్ కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే  ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.