స్థిరంగా ముగిసిన మార్కెట్లు

స్థిరంగా ముగిసిన మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నా మన మార్కెట్లు నిస్తేజంగా ముగిశాయి. ఉదయం నుంచి మార్కెట్లో పెద్దగా ఎలాంటి మార్పులు లేవు. అమెరికా, ఆసియా మార్కెట్లు ఒక మోస్తరు నుంచి భారీ లాభాలు పొందినా.. మన మార్కెట్ నామమాత్రపు లాభాలతో ముగిసింది. మిడ్ సెషన్ నుంచి ట్రేడవుతున్న యూరో మార్కెట్లు కూడా భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అయినా.. మన మార్కెట్లో పెద్దగా చలనం లేదు. నిఫ్టి ప్రధాన షేర్లలో తప్ప ఇతర షేర్లలో పెద్దగా మార్పులు లేవు. నిఫ్టి 22 పాయింట్ల లాభంతో 10934 వద్ద ముగిసింది. నిఫ్టి ప్రధాన షేర్లలో జీ ఎంటర్ టైన్ మెంట్ షేర్లు ఇవాళ 5 శాతం దాకా పెరిగాయి. టైటాన్ కూడా 4 శాతం పెరిగింది. యూపీఎల్ 3.6 శాతం, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటో కార్ప్ షేర్లు మూడు శాతం చొప్పున లాభపడ్డాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో కోల్ ఇండియా 2.7 శాతంతో టాప్ లో ఉంది.  తరువాతి షేర్లలో టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, ఎస్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఆర్‌ కామ్‌ ఇవాళ మరో 28 శాతం క్షీణించగా, ఆర్‌ కామ్‌ 30 శాతం, సుజ్లాన్‌ 24 శాతం చొప్పున క్షీణించాయి.