చంద్రబాబు వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరగలేదు..

చంద్రబాబు వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరగలేదు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగలేదన్నారు సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. శాసనసభ ఎన్నికల్లో మధిరలో కుట్రలు, కుతంత్రాలు చేశారని మండిపడ్డారు. మధిరను కొటామని చెప్పిన గుత్తేదారుడికి నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్న ఆయన... తన గెలుపు మధిర ప్రజల గెలుపుగా అభివర్ణించారు. ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బు పంపిణీ చేసిందని ఆరోపించిన మల్లు భట్టి విక్రమార్క. రైతు బంధు పథకం పేరుతో డబ్బులు బ్యాంకుల్లో వేశామంటూ ఓట్లు అడిగారని మండిపడ్డారు.