బకాయిలతో సహా నీటి తీరువా రద్దు

బకాయిలతో సహా నీటి తీరువా రద్దు

రైతుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వం నీటి తీరువాను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఆయన ఇవాళ మెదక్‌ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి తీరువా బకాయిలు రూ.600 కోట్లు ఉన్నాయని.. వాటిని కూడా రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. భవిష్యత్తులో కూడా తమ రాష్ట్రంలో ఇక నీటి తీరువాను వసూలు చేయమని స్పష్టం చేశారు. అంతకుమునుపు ఆయన మెదక్‌లో 82 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల సముదాయాలకు శంకుస్థాపన చేశారు.