రిజర్వేషన్ బిల్లుపై సవరణ కోరండి

రిజర్వేషన్ బిల్లుపై సవరణ కోరండి

ఈబిసిలకు 10శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులో సవరణ కోరాలని టిఆర్ఎస్ ఎంపీలకు సిఎం కేసిఆర్ ఆదేశించారు. గతంలోనే తెలంగాణలో ముస్లింలో వెనుకబడిన వారికి 12శాతం, ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ తీర్మానాన్ని పార్లమెంట్ లో పెట్టాల్సి ఉంది. ఇప్పుడు కేంద్రం రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చేపట్టినందున, ఈ బిల్లులో తెలంగాణ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని కూడా చేర్చేలా కోరాలని ఎంపీలకు సిఎం కేసిఆర్ సూచించారు. బిల్లులో సవరణ తెచ్చి, తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ను నెరవేర్చాలా పట్టుబట్టాలని సిఎం ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.