సీఎంతో సివిల్స్‌ టాపర్‌ లంచ్‌...

సీఎంతో సివిల్స్‌ టాపర్‌ లంచ్‌...

సివిల్స్‌ పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వాసి దురిశెట్టి అనుదీప్‌.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి లంచ్ చేశారు. సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు అనుదీప్, ఆయన తల్లిదండ్రులు సోమవారం ప్రగతి భవన్‌కు వచ్చారు. సీఎం కేసీఆర్‌తో కలిసి వారు లంచ్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌.. అనుదీప్‌ను అభినందించారు, అనుదీప్ తల్లిదండ్రులను సీఎం కేసీఆర్ సన్మానించారు. సీఎంతో పాటు ఎంపీ కవిత కూడా వారిని సన్మానించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. టాపర్‌గా నిలిచిన అనుదీప్ యువతకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. కష్టపడితే తప్పక విజయం వరిస్తుందనటానికి అనుదీప్ నిదర్శమని అన్నారు.