కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ...?

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ...?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనుంది తెలంగాణ ప్రభుత్వం. నాలుగు రోజుల పర్యటన కోసం నేడు హస్తినకు వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు... రేపు ప్రధాని మోడీతో సమావేశం కానున్న సంగతి తెలిసిందే. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం, రిజర్వేషన్ల పెంపుపై ప్రధానితో చర్చించనున్న సీఎం కేసీఆర్... ఇదే సందర్భంగా ప్రధాని మోడీని కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్నారు. 

మరోవైపు కాళేశ్వరం పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం... సకాలంలో పూర్తిచేసేందుకు చురుకుగా పనిచేస్తోంది. ఇక నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు ఎప్పటికప్పుడు సమీక్షలు, పనులను పరిశీలిస్తూనే ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫస్ట్ పంప్ హౌస్ జులై నాటికి పూర్తి కానుంది... ఇక ప్రధాని నరేంద్ర మోడీ వీలునుబట్టి... ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఇప్పటికే పోలవరం  పనులను వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు పరిశీలించి తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే.