నేడు మెదక్‌కు సీఎం...

నేడు మెదక్‌కు సీఎం...

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు మెదక్‌ జిల్లాలో పర్యటించనున్నారు. మెదక్‌ శివారులోని ఔరంగాబాద్‌లో నిర్మించ తలపెట్టిన కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌, జిల్లా అధికారుల నివాస సముదాయాలు, ఎస్పీ ఆఫీసుకు శంకుస్థాపన చేయనున్నారు. దీని కోసం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ నుంచి మెదక్‌ చేరుకుంటారు కేసీఆర్. శంకుస్థాపనలు పూర్తి చేసిన తర్వాత బోధన్‌ చౌరస్తాలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇక రాత్రికి మెదక్ పర్యటన ముగించుకుని కరీంనగర్ చేరుకుంటారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన కరీంనగర్‌లోనే రాత్రి బస చేయనున్నారు. కరీంనగర్ నుంచి రోడ్డుమార్గంలో రేపు హుజూరాబాద్ వెళ్లనున్న కేసీఆర్... రైతుబంధు పథకాన్ని ప్రారంభించనున్నారు.