నేడు గోవాకు సీఎం పారికర్‌

నేడు గోవాకు సీఎం పారికర్‌

క్లోమ గ్రంథి సమస్యతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పూర్తిగా కోలుకున్నారు. గత మూడు నెలలుగా క్లోమ గ్రంథి వైద్యచికిత్స నిమిత్తం సీఎం అమెరికాలో ఉన్నారు. పారికర్‌ ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడటంతో గురువారం తిరిగి గోవాకు వచ్చేస్తున్నారు. పారికర్‌ అమెరికా నుంచి నేరుగా ముంబయి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి గోవా చేరుకుంటారని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఫిబ్రవరి 14న మొదటగా ముంబైలోని లీలావతి హాస్పటల్‌లో చేరిన సీఎం పారికర్‌.. డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ముగ్గురు సభ్యలతో కూడిన సలహా కమిటీ ఆధ్వర్యంలో గోవా పాలన నడుస్తోంది. సీఎం పారికర్‌ అమెరికాకు వెళ్లే ముందు ఈ కమిటీని ఏర్పాటు చేశారు.