ఇద్దరిని బలిగొన్న కోడి పందాలు

ఇద్దరిని బలిగొన్న కోడి పందాలు

కోడి పందాలు రెండు నిండు ప్రాణాలను తీసింది. ఈ విషాద ఘటన చాట్రాయి మండలం చిత్తాపూర్ గ్రామంలో జరిగింది. సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రలో కోడి పందాలు జోరుగా సాగుతుంటాయి. ఈ  క్రమంలో చిత్తాపూర్ గ్రామంలో కూడా గురువారం అర్ధరాత్రి కోడి పందాలు నిర్వహించారు. పందాలు పెరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసి ఇద్దరు యువకులు పరారయ్యారు. పరుగెడుతున్న ఇద్దరు బావిలో పడి మృతిచెందారు. మృతులు విస్సన్నపేట కొండపర్వకు చెందిన కుక్కల చిన్నారావు, చిత్తాపూర్ కు చెందిన చిత్తూరు శ్రీనుగా గుర్తించారు. ఈ ఘటనతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.