బిర్యానిలో బొద్దింక

బిర్యానిలో బొద్దింక

ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో కస్టమర్‌కు సరఫరా చేసిన బిర్యానిలో బొద్దింక ప్రత్యక్షమయింది. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి జనగామలోని ఓ బార్‌ అండ్‌  రెస్టారెంట్‌లో కస్టమర్‌కు సరఫరా చేసిన బిర్యానిలో చనిపోయిన బొద్దింక ఉంది. దీంతో కస్టమర్‌ గొడవకు దిగడంతో.. రెస్టారెంట్‌లో గందరగోళం నెలకొంది. కొద్దిసేపు రెస్టారెంట్‌ యాజమాన్యం, కస్టమర్‌ మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఈవిషయంపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. నాసిరకం ఆహార పదార్థాలు విక్రయించే హోటళ్లపై ఓ వైపు దాడులు జరుగుతున్నా.. హోటళ్లు, బార్‌ నిర్వాహకుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు.