పెరుగుతున్న చలి

పెరుగుతున్న చలి

గత నాలుగురోజుగా మోస్తరుగా ఉన్న చలి మంగళవారం నుండి క్రమంగా పెరుగుతోంది. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి శీతల గాలులు వీస్తున్న కారణంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శీతల గాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. బుధవారం కుమురం భీం జిల్లాలో 4.9, సిర్పూరులో 5.2, సంగారెడ్డి జిల్లాలో 5.4, ఆదిలాబాద్‌ జిల్లాలో 6, కామారెడ్డి జిల్లాలో 6.2, రంగారెడ్డిలో 7, శంకర్‌పల్లిలో 7.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురు, శుక్రవారాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండనుంది.

మరోవైపు విశాఖ ఏజెన్సీలో చలి పంజా విసురుతోంది. ఏజెన్సీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరులో 8 డిగ్రీలు, మినుములూరులో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒకవైపు మంచు, మరోవైపు చలి తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం అయితే ఇళ్ల నుండి బయటకు వచ్చేందుకు బయపడుతున్నారు.