జేడీఎస్ కు సీఎం... కాంగ్రెస్ భారీ ఆఫర్

జేడీఎస్ కు సీఎం... కాంగ్రెస్ భారీ ఆఫర్

కర్ణాటక ఫలితాలు హంగ్ దిశగా పయనిస్తున్నాయి. తొలుత క్లియర్ మెజారిటీ దిశగా వెళ్లిన బీజేపీ ఆ తర్వాత తగ్గిపోతూ వస్తుంది.  ప్రస్తుతం ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కంటే దాదాపు 8 సీట్ల వెనుకబడి ఉంది. దీంతో రాజకీయ పరిణామాలు ఊపందుకున్నాయి. క్షణ క్షణం రాజకీయాలు మారిపోతున్నాయి. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? అనే ఉత్కంఠపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. 
ఈ పరిస్థితుల్లో బెంగళూరులో జేడీఎస్, కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. ఎన్నికల ఫలితాలపై తీవ్రంగా సమీక్షిస్తూ... క్షణ క్షణం చర్చోపచర్చలు జరుపుకుంటున్నారు. ఈ సమయంలో కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జేడీఎస్ కు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే... కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.