మరోసారి భేటీ కానున్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ

మరోసారి భేటీ కానున్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ

సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ “సెంట్రల్ ఎలక్షన్ కమిటీ” మరోసారి భేటీ కానుంది. ఈ నెల 11 న ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో ఈ భేటీ జరుగనుంది. సుమారు 20 స్థానాలకు సంభందించిన అభ్యర్థుల ఎంపికపై కమిటీ చర్చించనుంది. కాంగ్రెస్ పార్టీ 94 స్థానాల్లో పోటీ చేయనుండగా.. ఈ నెల 10న మహాకూటమి మొదటి జాబితాలో 74 మందితో కూడిన కాంగ్రెస్ తొలి జాబితా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మిగిలిన 20 స్థానాలకు సంభందించిన అభ్యర్థుల ఎంపికపై కమిటీ తీవ్ర చర్చలు జరపనుంది. రాహుల్ గాంధీ వీలుగా ఉండే సమయాన్ని బట్టి 11 తేదీ సాయంత్రం కమిటీ సమావేశం కానుంది. మరింత లోతుగా విశ్లేషించి బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు 20 స్థానాలను పెండింగ్ లో పెట్టారని తెలుస్తోంది. వ్యూహాత్మకంగా చివరి నిముషంలో మిగిలిన స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించిందట.