8 సీట్లకు టీజేఎస్ అంగీకారం

8 సీట్లకు టీజేఎస్ అంగీకారం

టీపీసీసీ, టీజేఎస్ సీట్ల ఒప్పందం ఓ కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన 8 సీట్లకు టీజేఎస్ అంగీకారం తెలిపింది. గురువారం నాడు ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, టీపీసీసీ ఇంచార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సలీం అహ్మద్, శ్రీనివాసన్ లతో టీజేఎస్ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ దిలీప్ కుమార్, ముఖ్య నాయకులు రాజేందర్ రెడ్డి, గోపాల్ శర్మలు సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో టీజేఎస్ కు 8 స్థానాలు కేటాయిస్తూ అంగీకారం కుదిరింది. కాగా మొదట విడతగా 5 స్థానాలకు ఏకాభిప్రాయం వచ్చింది. మిగతా 3 స్థానాలకు మరో రెండు రోజులలో స్పష్టత వస్తుంది. అయితే పొత్తుల ఒప్పందం టీఆర్ఎస్ ఓటమి లక్షంగా ఒక ప్రజా కూటమి గెలుపు కోసమే ఏర్పాటు చేసినట్టు కూటమి నేతలు ప్రకటించారు.