తెలంగాణ ఇంటిపార్టీకి నకిరేకల్ సీటు...

తెలంగాణ ఇంటిపార్టీకి నకిరేకల్ సీటు...

తెలంగాణ మహాకూటమిలో సీట్ల కేటాయింపు ఓ కొలిక్కి వచ్చింది. ఎట్టకేకలకు ఈ నెల 10న మహాకూటమి మొదటి జాబితా విడుదల కానుంది. కాంగ్రెస్ మొత్తం 93 స్థానాల్లో పోటీ చేయనుంది. మహాకూటమి భాగస్వామ్య పార్టీలకు 26 సీట్లను కాంగ్రెస్ ఖరారు చేసింది. కేటాయించిన 26 సీట్లలో.. టీడీపీకి 14, టీజేఎస్ కి 8, సీపీఐకి 3, తెలంగాణ ఇంటి పార్టీకి ఒక సీటును కేటాయించింది. అయితే తెలంగాణ ఇంటి పార్టీకి నకిరేకల్ సీటు కేటాయిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక్కడి నుంచి చెరుకు సుధాకర్ భార్య లక్ష్మీ పోటీ చేయనుంది.