ధర్మపోరాట దీక్షా వేదికపై ఆసక్తికర సంఘటన

ధర్మపోరాట దీక్షా వేదికపై ఆసక్తికర సంఘటన

ఏపీకి జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబు ఢిల్లీలో తలపెట్టిన ధర్మపోరాట దీక్షలో ఆసక్తికర సంఘటన జరిగింది. చంద్రబాబు దీక్షకు పలువురు జాతీయ నేతలు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. అందరిలాగే కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా హజరయ్యారు. సభా వేదికపై ప్రసంగించిన అనంతరం ఆయన వద్దనున్న మైకును చంద్రబాబు అందుకున్నారు. విభజన బిల్లు రూపకల్పన చేసింది జైరాం రమేష్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో జైరాం రమేష్ తల బాదుకున్నారు. తన భార్య చనిపోయిన బాధలో ఉన్నా.. ఏపీకి మద్దతు తెలిపేందుకు ఆయన వచ్చారని చంద్రబాబు సభలో తెలిపారు.