ప్రభుత్వ చొరవకు గూడూరు కృతజ్ఞతలు

ప్రభుత్వ చొరవకు గూడూరు కృతజ్ఞతలు

బస్వపూర్ ప్రాజెక్ట్ లో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇప్పించడంలో ప్రభుత్వ చొరవకు టీపీసీసీ నేత గూడూరు నారాయణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ..  గతవారం కాంగ్రెస్ పార్టీ చేసిన ధర్నా కు స్పందించి ప్రభుత్వం ముందుకు రావడం సంతోషమన్నారాయన. భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం తోపాటు గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు నారాయణ రెడ్డి.శాంతియుత వాతావరణంలో జరుగుతున్న ఏకైక ప్రాజెక్ట్ బస్వపూర్ ప్రాజెక్ట్ అని, ప్రాజెక్ట్ కింద భూములు, ఇండ్లు కోల్పోతున్న వారికి త్వరితగతిన నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు.  రూ.1200కోట్లతో బీబీనగర్ లో ఎయిమ్స్ ఏర్పాటుకు  కేంద్రం సంసిద్దత తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత సిఎం రాజశేఖరరెడ్డి చొరవ వల్లనే ఎయిమ్స్ కల సాకారమైందన్నారాయన.కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పూర్తి స్థాయిలో రెడీ చేయడం వల్లే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎయిమ్స్ నిర్మాణం సులువైందని అన్నారు నారాయణరెడ్డి.ఇప్పటికైనా ఈ అవకాశాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.