108,104 వాహనాల్లో డబ్బులు, మద్యం...

108,104 వాహనాల్లో డబ్బులు, మద్యం...

108, 104 వాహనాల్లో డబ్బులు, మద్యం తరలిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. ప్రజా కూటమి నేతలు ఎల్. రమణ, వి.హనుమంతరావు, జంధ్యాల రవి శంకర్, రావుల చంద్రశేఖర్ రెడ్డిలు సీఈఓ రజత్ కుమార్ ను కలిసారు. ప్రజా కూటమి నేతల ఇళ్లపై పోలీసులు ఏకపక్షంగా సోదాలు చేయడంపై ఫిర్యాదు చేశారు. అనంతరం వి.హనుమంతరావు మాట్లాడుతూ... పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఇంటిపైకి 50 మంది పోలీసులను పంపి దాడులు చేయడం ఏ మేరకు సబబు?. సీఎం కేసీఆర్ కు ఇంత భయమేందుకు? అని ప్రశ్నించారు. పోలీసులు కూడా టీఆర్ఎస్ కు ప్రచారం చేయమని చెప్తున్నారు.. కూకట్ పల్లి ప్రాంతంలో పోలీస్ అధికారులు టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీసులు సీఎం కేసీఆర్ ఇంటిపై, ప్రగతి భవన్  పై దాడులు చేయమంటే చేస్తారా? అని హనుమంతరావు ప్రశ్నించారు.

108,104 వాహనాల్లో డబ్బులు, మద్యం తరలిస్తున్నారు.. కాంగ్రెస్, తెలుగుదేశం కార్యకర్తలు 108, 104 వాహనాలను తనిఖీ చేయండని హనుమంతరావు సూచించారు. చెడ్డపేరు తెచ్చుకోవద్దని డీజీపీ  మహేందర్ రెడ్డికి సూచించారు. మహిళలని కూడా చూడకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.